India లో Digital Products ఎక్కడ అమ్మాలి? నేను వాడిన Platforms అన్నీ

India లో Digital Products ఎక్కడ అమ్మాలి

గత కొన్ని నెలలుగా నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఇదే — “సార్, e-book రెడీ చేసాను, ఇప్పుడు ఎక్కడ పెట్టి అమ్మాలి?”

నిజం చెప్పాలంటే, product తయారు చేయడం కంటే ఈ decision చాలామందిని ఎక్కువ రోజులు ఆపేస్తుంది. ఒకరు Instagram లో “Gumroad వాడండి” అంటారు, ఇంకొకరు “SuperProfile బెస్ట్” అంటారు. YouTube లో ఇంకో పది పేర్లు వినిపిస్తాయి. చివరికి ఏదీ ఎంచుకోకుండా product laptop లోనే ఉండిపోతుంది.

అందుకే ఈ ఆర్టికల్ రాస్తున్నాను. ఇక్కడ నేను వాడిన, నా students వాడుతున్న platforms గురించి — ఏది ఎవరికి సరిపోతుందో సూటిగా చెప్తాను.

ముందు ఈ విషయం అర్థం చేసుకోండి

“Best platform ఏది?” అనే ప్రశ్నకి సరైన సమాధానం లేదు. ఎందుకంటే మీ product ఏంటి, మీ customers ఎక్కడ ఉన్నారు, మీ price ఎంత — వీటిని బట్టి answer మారుతుంది.

₹299 e-book ని Telugu audience కి అమ్మడం, $29 Notion template ని US audience కి అమ్మడం — ఇవి రెండూ వేర్వేరు పనులు. రెండింటికీ ఒకే platform సరిపోదు.

కాబట్టి platform ఎంచుకునే ముందు ఈ ఐదు ప్రశ్నలు వేసుకోండి:

Fees ఎంత తీసుకుంటారు? ప్రతి platform commission తీసుకుంటుంది, లేదా monthly subscription తీసుకుంటుంది, లేదా రెండూ. ₹500 product అమ్మితే మీ చేతికి ఎంత వస్తుందో ముందే లెక్క వేసుకోండి. చిన్న ధర products లో ఈ తేడా చాలా పెద్దది.

డబ్బు ఎప్పుడు వస్తుంది? కొన్ని platforms కొన్ని రోజుల్లో settle చేస్తాయి. కొన్ని వారం తీసుకుంటాయి. Amazon KDP లాంటివి రెండు నెలలు పైనే పడతాయి. మీరు ads మీద డబ్బు ఖర్చు చేస్తుంటే, ఈ gap మీ cash flow ని దెబ్బతీస్తుంది.

UPI ఉందా? India లో ఇది negotiable కాదు. UPI లేకపోతే checkout దగ్గర సగం మంది ఆగిపోతారు. Card details type చేయడానికి చాలామంది ఇష్టపడరు.

Auto-delivery ఉందా? Payment అయిన వెంటనే customer కి product automatic గా వెళ్ళాలి. మీరు రోజూ కూర్చుని manually file పంపుతుంటే — అది business కాదు, job. రాత్రి రెండు గంటలకి sale వచ్చినా product వెళ్ళిపోవాలి.

Sales page ఉందా? మీకు website లేకపోతే, platform లోనే product page తయారు చేసుకునే option ఉండాలి.

ఈ ఐదింటికీ సమాధానం తెలిస్తే, కింద ఉన్న platforms లో మీకు ఏది సరిపోతుందో మీరే చెప్పగలరు.

India లో అమ్మాలంటే

SuperProfile

మొదటిసారి product అమ్మేవాళ్ళకి నేను ఇదే suggest చేస్తాను. Indian creators కోసమే తయారైంది, కాబట్టి ఇక్కడ అన్నీ INR లో, UPI తో, మనకి అర్థమయ్యేలా ఉంటాయి.

Product upload చేయడం, price పెట్టడం, link share చేయడం — ఒక గంటలో అయిపోతుంది. E-books, mini courses, templates, paid webinars అన్నీ అమ్మొచ్చు. Website అవసరం లేదు, ready-made product page వస్తుంది.

Payment అయిన వెంటనే customer కి file automatic గా వెళ్తుంది. మీరు ఏమీ చేయనవసరం లేదు.

Profo

మీ దగ్గర ఒకటి కాకుండా నాలుగైదు products ఉంటే ఇది బాగుంటుంది. అన్నీ ఒకే page లో store లా కనిపిస్తాయి — Instagram bio link లా పని చేస్తుంది.

Customer ఒక product కోసం వచ్చి, అక్కడ మిగతావి చూసి ఇంకొకటి కూడా కొనే అవకాశం ఉంటుంది. Single product ఉన్నవాళ్ళకి మాత్రం ఇది పెద్ద advantage కాదు.

Instamojo

India లో చాలా పాత platform. Digital products తో పాటు physical products కూడా అమ్మొచ్చు. Payment links create చేయడం simple.

మీరు future లో physical products కూడా (printed books, merchandise) అమ్మాలనుకుంటే ఇది ఆలోచించొచ్చు.

Razorpay Payment Pages

ఇది platform కాదు — payment gateway. తేడా ఇదే: platform లో మీ product page వాళ్ళ site లో ఉంటుంది. Razorpay లో మీ page మీ website లోనే ఉంటుంది, కేవలం payment మాత్రం Razorpay handle చేస్తుంది.

Commission తక్కువ, brand పూర్తిగా మీది, customer data మీ దగ్గరే ఉంటుంది. కానీ మీకు సొంత website కావాలి, KYC (PAN, bank account, business proof) ఇవ్వాలి, auto-delivery మీరే setup చేసుకోవాలి.

నా digital products course కి నేను వాడేది ఇదే. ₹1,000 పైన price ఉన్న products కి, ads run చేసేవాళ్ళకి ఇది సరైనది.

Global గా అమ్మాలంటే

ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇది చాలామంది miss అవుతారు.

అదే product ని global audience కి అమ్మితే ధర చాలా ఎక్కువ పెట్టొచ్చు. India లో ₹499 కి అమ్మే Notion template, US market లో $19 కి అమ్ముడవుతుంది. అదే file. అదే effort. మూడు రెట్లు ఎక్కువ డబ్బు.

కాబట్టి Indian platform లో list చేసాక, global platform లో కూడా పెట్టండి. రెండు చోట్లా parallel గా అమ్మొచ్చు.

Gumroad

Global creators అందరూ వాడేది. Account create చేయడం చాలా సులభం, product upload చేసి link share చేస్తే అమ్మకం మొదలు. India కి payouts వస్తాయి.

Digital downloads — e-books, templates, presets, files — వీటికి ఇది బాగుంది.

Payhip

Gumroad కి alternative. E-books, courses, memberships అమ్మొచ్చు. Free plan లో కూడా చాలా features ఉంటాయి, కాబట్టి మొదలుపెట్టడానికి risk లేదు.

Courses అమ్మేవాళ్ళకి Gumroad కంటే ఇది కొంచెం better.

Etsy

Etsy లో ఒక పెద్ద advantage ఉంది, మిగతా వాటిలో లేనిది — అక్కడే buyers ఉన్నారు.

మిగతా platforms లో మీరు product పెట్టి ఊరుకుంటే ఏమీ జరగదు. Traffic మీరే తేవాలి — Instagram, ads, YouTube, ఏదో ఒకటి. Etsy లో మాత్రం people “Canva instagram templates” అని search చేసి మీ product కనుక్కుంటారు.

Templates, printables, planners, digital art — వీటికి Etsy best. ప్రతి listing కి చిన్న fee, sale కి commission ఉంటాయి, కానీ traffic కోసం మీరు ఖర్చు పెట్టనవసరం లేదు కాబట్టి అది worth it.

మీ product కి ఏది?

సూటిగా చెప్పాలంటే:

E-book రాసారా — India లో SuperProfile, global గా Payhip.

Canva లేదా Notion templates చేసారా — India లో SuperProfile, global గా Etsy (ఇక్కడ Etsy చాలా strong).

Mini course తయారు చేసారా — SuperProfile లేదా Payhip.

₹2,000+ ధర ఉన్న full course అయితే — సొంత website + Razorpay. ఎక్కువ ధర products కి platform page సరిపోదు.

Printables, planners అయితే — Etsy.

మొదటి product అయితే మాత్రం ఒకే platform తో మొదలుపెట్టండి. నాలుగు చోట్ల account create చేసి, నాలుగు చోట్లా list చేసి, చివరికి ఎక్కడా promotion చేయకుండా ఆగిపోయేవాళ్ళని నేను చాలామందిని చూసాను. ఒక platform, ఒక product, ఒక promotion. అది పని చేసాక రెండోది.

సొంత website ఎప్పుడు కావాలి?

మొదట్లో అవసరం లేదు. ఇది స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది “ముందు website చేయాలి” అనుకుని మూడు నెలలు అక్కడే ఆగిపోతారు.

SuperProfile లో product live చేసి, మొదటి పది sales తెచ్చుకోండి. అది ముఖ్యం. Website తర్వాత.

కానీ ఈ మూడు పరిస్థితుల్లో website తప్పనిసరి అవుతుంది:

Price ₹1,000 దాటితే. ఎక్కువ ధర పెట్టినప్పుడు customer మీ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. Platform product page అంత confidence ఇవ్వదు.

Meta ads run చేస్తే. Pixel install చేసి conversions track చేయాలంటే మీ control లో ఉన్న page కావాలి. Retargeting ads — అంటే page చూసి కొనకుండా వెళ్ళిపోయినవాళ్ళకి మళ్ళీ ad చూపించడం — దీనికి ఇది తప్పనిసరి. Ads మీద serious గా ఉంటే website లేకుండా కుదరదు.

Long-term brand build చేస్తుంటే. Platform rules మార్చొచ్చు, fees పెంచొచ్చు, account block అవ్వొచ్చు. ఇవి మీ control లో లేవు. సొంత domain మాత్రం మీ asset, ఎవరూ తీసేయలేరు.

Website వచ్చాక platforms వదిలేయాల్సిన అవసరం లేదు. Website మీ main store, platforms extra distribution channels. రెండూ కలిసి నడుస్తాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

Digital products అమ్మడానికి GST registration కావాలా?

Turnover ఒక limit దాటితే GST registration అవసరం అవుతుంది, మరియు కొన్ని platforms payouts కోసం GSTIN అడుగుతాయి. మొదట్లో చిన్న sales ఉంటే వెంటనే అవసరం రాకపోవచ్చు. కానీ ఇది మీ situation బట్టి మారుతుంది కాబట్టి ఒక CA ని అడిగి confirm చేసుకోండి. ఈ విషయంలో guess చేయకండి.

Website లేకుండా అమ్మొచ్చా?

అవును. SuperProfile, Profo, Gumroad, Payhip — వీటిలో ఏదైనా account create చేసి product upload చేస్తే చాలు. Coding, hosting, domain — ఏదీ అవసరం లేదు.

డబ్బు ఎంత సమయంలో వస్తుంది?

Indian platforms లో సాధారణంగా కొన్ని రోజుల్లో. Global platforms లో వాళ్ళ payout cycle ప్రకారం (వారానికి లేదా నెలకి ఒకసారి), plus international transfer కి కొన్ని రోజులు అదనం. Exact timelines ప్రతి platform లో మారతాయి, account create చేసేటప్పుడు చూసుకోండి.

ఒకే product ని అన్ని platforms లో పెట్టొచ్చా?

చాలా వరకు పెట్టొచ్చు. ఒక exception మాత్రం ఉంది — Amazon KDP Select లో enroll చేస్తే, ఆ e-book 90 రోజులు Amazon కి exclusive. ఆ సమయంలో అదే book ని వేరే చోట అమ్మడం terms violation, account risk లో పడుతుంది. SuperProfile, Gumroad, Payhip లో అలాంటి rule లేదు.

మొదటి sale రావడానికి ఎంత సమయం పడుతుంది?

ఇది పూర్తిగా మీ promotion మీద ఆధారపడి ఉంటుంది. Product live చేసి ఊరుకుంటే sales రావు — platform మీకు traffic ఇవ్వదు (Etsy తప్ప). Instagram, WhatsApp, YouTube లేదా paid ads ద్వారా మీరే traffic తేవాలి. Audience ఉన్నవాళ్ళకి కొన్ని రోజుల్లో రావొచ్చు, కొత్తగా మొదలుపెట్టేవాళ్ళకి కొన్ని వారాలు పట్టొచ్చు. ఇక్కడ నేను మీకు అబద్ధం చెప్పను.

చివరగా

Platform ఎంచుకోవడానికి వారాలు ఆలోచించకండి. SuperProfile లో account create చేయడానికి పది నిమిషాలు పడుతుంది. మీకు నచ్చకపోతే తర్వాత మారొచ్చు — product మీదే, platform కాదు.

అసలు కష్టమైన పని platform ఎంచుకోవడం కాదు. Product తయారు చేయడం, దాన్ని జనానికి చేరవేయడం. అక్కడే చాలామంది ఆగిపోతారు.


రచయిత గురించి

నేను అనిల్ కుమార్ పాండిరి, DMAT Academy founder. 8+ సంవత్సరాలుగా digital marketing లో పని చేస్తున్నాను, 100+ websites build చేసాను. Digital products, AI, website design — simple Telugu లో నేర్పుతాను.


Digital product తయారు చేసి అమ్మడం step by step నేర్చుకోవాలా?

14 రోజుల live course లో — research నుంచి platform setup, sales page, live Meta ad campaign వరకు అన్నీ చేసి చూపిస్తాను. పూర్తిగా Telugu లో.

Course details చూడండి →